Narayana college నారాయణ కాలేజీలో రాసలీలలు.. దొరికిపోయిన కాలేజీ డీన్..
ప్రధానాంశాలు:
Narayana college నారాయణ కాలేజీలో రాసలీలలు.. దొరికిపోయిన కాలేజీ డీన్
Narayana college dean doing indecent acts in college,Narayana college
అర్థరాత్రి పూట ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని మరదలిని లైంగికంగా వేధించిన నారాయణ సంస్థ చైర్మన్ నారాయణ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.
Narayana college విద్యాలయాలు దేవాలయాలతో సమానం. వాటి పవిత్రత వెలకట్టలేనిది. అందులో పని చేసే గురువులు దేవుళ్ళతో సమానం. విద్యకు చదువుకు మనం ఇచ్చే గౌరవ అది. కానీ కొందరు దానిని వ్యాపారం గా మార్చుకొని కోట్లు సంపాదిస్తున్నారు. విద్యను ఒక సామాజిక బాధ్యతగా కాకుండా సంపాదన మార్గంగా భావిస్తున్నారు. ఇలాంటి వారు ఉన్నచోటే అనైతిక కార్యక్రమాల కు అడ్డు ఏమి ఉంటుంది. నారాయణ కాలేజీ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆవు పొలాన మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా చైర్మన్ సిబ్బంది ఉండడంతో సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అర్థరాత్రి పూట ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని మరదలిని లైంగికంగా వేధించిన నారాయణ సంస్థ చైర్మన్ నారాయణ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నూల్ లోని నారాయణ కాలేజీ ఛైర్మన్ కింది స్థాయి ఉద్యోగులతో రాసలీలలు చేస్తూ దొరికిపోయాడట. కర్నూల్ లోని నారాయణ కాలేజ్ కోటి లింగేశ్వర రెడ్డి అక్కడి మహిళలతో ఆఫీసులో రాసలీలలు చేస్తున్నారు. ఇది గమనించిన, అక్కడే పని చేస్తున్న గోపికృష్ణ, నజర్ ఆ గదిలో స్పై కెమెరాలు పెట్టి రికార్డు చేశారు. వాటిని లింగేశ్వర్ రెడ్డి కి చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు చేయించుకున్నారు. దీంతో పాటు వాళ్ళ శాలరీని కూడా పెంచేందుకు హామీ తీసుకున్నారు. తర్వాత ఆ వీడియోలు నబీర్ అనే వ్యక్తికి చేరాయి. ఆయన మరికొంతమందికి వీడియోలను పంపడంతో వీరంతా బ్లాక్ మెయిల్ చేయడంతో పెద్ద మొత్తంలో నగదును ఇచ్చుకున్నాడు.
అయితే మొత్తం డబ్బు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఈ వీడియోను ఇంస్టాగ్రాఫ్, ఫేస్బుక్ లో పెట్టి వైరల్ చేస్తామని చెప్పడంతో, పరిస్థితి అదుపుతప్పుతుందని భయపడడంతో లింగేశ్వర రెడ్డి ఎస్పీ కి లేఖ రాశారు. దీంతో పోలీసులు బ్లాక్మెయిలర్లను తీసుకొని వారి ఫోన్ లోని వీడియోని డిలీట్ చేయించి, ఆయన ఆస్తులను కూడా రిటర్న్ ఇచ్చేశారు. వారిని హైదరాబాద్ బదిలీ చేశారు. కాలేజీలో వందలాది విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి. వీటిని డబ్బుతో కప్పిపుచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో నారాయణ పెద్ద సంస్థ అని చెప్పుకుంటూ ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.