New Metro Root : హైదరాబాద్ లో కొత్త మెట్రో రూట్.. ఏయే రూట్స్ కవర్ చేస్తారో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Metro Root : హైదరాబాద్ లో కొత్త మెట్రో రూట్.. ఏయే రూట్స్ కవర్ చేస్తారో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  New Metro Root : హైదరాబాద్ లో కొత్త మెట్రో రూట్.. ఏయే రూట్స్ కవర్ చేస్తారో తెలుసా..?

New Metro Root : హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా కోసం అక్కడ రవాణా సౌకర్యాలను కూడా పెంచుతుంది ప్రభుత్వం. ఇప్పటికే రోడ్లన్నీ కూడా చాలా రద్దెగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేయాలంటే జనాలందరు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐతే మెట్రోల్ వచ్చాక కొంత మేర తగ్గినట్టు అనిపించినా రోడ్ మార్గాన వెళ్లే వారు మాత్రం ఈ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఐతే మెట్రో సేవలు పొడిగిస్తే ఇంకాత బాగుంటుందని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోగా ఇప్పుడు మరోసారి మెట్రో పొడిగించే ప్లానింగ్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల టైం లో ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు ప్రారంభించగా.. మహిళా సంక్షేమం కోసం ఇంకా కొన్ని పథకాలను తీసుకొస్తున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. డీఎస్సీ తో పాటు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.

New Metro Root నాలుగేళ్లలో మెట్రో పొడిగింపు పూర్తి..

ఐతే లేటెస్ట్ గా భాగ్య నగర్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రజలు కాస్త ఖుషిగా ఉనారు. ఐతే వీటిని ఇంకా పొడిగించాలని చూస్తుంది ప్రభుత్వం. హైదరాబాద్ తరహాలో మరో కొత్త నగరాన్ని నిర్మించేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. నూతన నగరానికి మెట్రో రూట్ కూడా ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ సిటీ నుంచి ఫోర్త్ సిటీ గా కొత్తటి ఏర్పాటు చేసి దానికి రవాణా సౌకర్యాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త సిటీకి రోడ్, మెట్రో రూట్ కి కూడా శ్రీకారం చుట్టారు.

New Metro Root హైదరాబాద్ లో కొత్త మెట్రో రూట్ ఏయే రూట్స్ కవర్ చేస్తారో తెలుసా

New Metro Root : హైదరాబాద్ లో కొత్త మెట్రో రూట్.. ఏయే రూట్స్ కవర్ చేస్తారో తెలుసా..?

ఎయిర్ పోర్ట్ నుంచి రాబోతున్న ఫ్యూచర్ సిటేఎకి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం కాగా.. ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ ఆర్ నుంచి రిజినర్ రింగ్ రోడ్ ఆర్.ఆర్.ఆర్ వరకు మెట్రో పొడిగించేలా చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బెగరికంచ ప్రంతాన్ని కొత్త సిటీగా మార్చేలా రేవంత్ అభివృద్ధి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సిటీకి వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్లు తీసుకొచి అక్కడ ఆరోగ్య, క్రీడలు ఇంకా ఇతర కంపెనీలను కూడ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సో కొత్త సిటీకి మెట్రో వచ్చేలా కూడా చూస్తున్నారని తెలుస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది