Rythu Bharosa : సంక్రాంతి వేళ రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : సంక్రాంతి వేళ రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..!
Rythu Bharosa: సంక్రాంతి sankranti 2026 వేళ రైతులకు Farmar గొప్ప శుభవార్త తెలిపారు CM Revanth reddy సీఎం రేవంత్. రైతు భరోసా Rythu Bharosa నిధుల విడుదలపై స్పష్టత ను ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది గొప్ప వార్తే నే చెప్పాలి. యాసంగి (రబీ) సీజన్ ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా, పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలుత సంక్రాంతి పండుగ నాటికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. తాజా సమాచారం ప్రకారం, జనవరి 26వ తేదీ (గణతంత్ర దినోత్సవం) నుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ సుమారు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ విడతలో అర్హులైన రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది.
Rythu Bharosa : సంక్రాంతి వేళ రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..!
Rythu Bharosa రైతులకు పెట్టుబడి సాయం
ఈసారి రైతు భరోసా నిధులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వే. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ నిధులు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గతంలో సాగు చేయని భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా నిధులు వెళ్లినట్లు గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు శాటిలైట్ సాంకేతికత ద్వారా పంట పొలాలను గుర్తిస్తోంది. ఈ సర్వేకు సంబంధించిన వివరాల సేకరణ పూర్తయి, ప్రస్తుతం కంప్యూటర్లలో డేటా ప్రాసెసింగ్ జరుగుతోంది. సాగులో ఉన్న భూములను కచ్చితంగా గుర్తించే ఈ ప్రక్రియ వల్ల కొంత సమయం పడుతోంది, తద్వారా నిధుల జమలో జాప్యం చోటుచేసుకుంది.
Rythu Bharosa రైతు భరోసా అమలులో మార్పులు
రైతు భరోసా అమలులో ప్రభుత్వం ఈసారి విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సాగుకు వినియోగించని భూములను పథకం నుంచి మినహాయించడంతో పాటు, అర్హతలపై కొత్త రూల్స్ తీసుకువచ్చింది. అనర్హులకు నిధులు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా నిజమైన రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన ప్రకారం, క్షేత్రస్థాయిలో పంట సాగు ఆధారంగానే ఈ సాయం అందుతుంది. పారదర్శకతను పెంచడం కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి చివరి వారం నుంచి నిధులు అందుతాయన్న వార్తతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు.