Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!
ప్రధానాంశాలు:
Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!
Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తానని ప్రకటించడంతో, కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు. బీసీల కోసం పోరాడుతున్న కవిత, ముందుగా తాను అధ్యక్షురాలిగా ఉన్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థ అధ్యక్ష పదవిని ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. ఈ సవాళ్లు కవితను కొత్త చిక్కుల్లోకి నెట్టాయి.

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!
Kavitha : ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ సూటి ప్రశ్న
కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, బీసీ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కంటితుడుపు చర్యలు చేపడుతోందని కవిత అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని కవిత హామీ ఇచ్చారు. అయితే, కవిత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే, ఆ మాటలను ఆచరణలో చూపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ రాజకీయ పరిణామాలపై విశ్లేషకులు మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల అంశం రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ బీసీ వర్గాల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ద్వారా తామే బీసీల పక్షపాతులమని నిరూపించుకోవాలని చూస్తున్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రతిస్పందిస్తూ, ఆమె సొంత సంస్థలోనే బీసీ నాయకులకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేయడం, ఈ రాజకీయ పోరాటంలో ఒక కొత్త మలుపు. ఈ చర్చ చివరికి ఏ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా, ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతుందని చెప్పవచ్చు.