
Mahabubabad : నచ్చిన కటింగ్ చేయించలేదని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు..!
Mahabubabad : ఇటీవలి కాలంలో పిల్లలు చాలా సెన్సిటివ్‌గా మారుతున్నారు. చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేని హెయిర్ కట్టింగ్ చేయించాడని తండ్రి మీద కోపంతో ఓ తొమ్మిదేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ బాలుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు గురువారం ప్రాణాలు విడిచాడు.
వివరాలలోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న వాడైన ఈసం హర్షవర్థన్(9) సీతా నాగారంలోని హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదివాడు. అయితే వేసవి కాలం సెలవుల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలాఉంటే మే 25వ తేదీన ఈసం కాంతారావు తన కొడుకైన హర్షవర్ధన్ ను హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉన్న సెలూన్ షాప్ నకు తీసుకెళ్లాడు. అక్కడ తండ్రి కాంతారావు చెప్పిన ప్రకారం సెలూన్ షాప్ వ్యక్తి హర్షవర్ధన్ కు కటింగ్ చేయగా, అది ఆ బాలుడికి నచ్చలేదు. దీంతో తనకు నచ్చిన విధంగా కట్టింగ్ చేయించలేదని, ఆ స్టైల్ తనకు నచ్చలేదని తండ్రితో హర్ష వర్ధన్ గొడవ పడ్డాడు.
Mahabubabad : నచ్చిన కటింగ్ చేయించలేదని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు..!
హర్షవర్ధన్ కటింగ్ నచ్చలేదని గొడవ చేస్తుండటంతో చదువుకునే అబ్బాయికి హెయిర్ అలాగే ఉండాలని తండ్రి కాంతారావు నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు. కానీ హర్షవర్ధన్ ఎంతకూ వినకపోగా, అలాగే ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటి వెనకాల ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా, హర్ష వర్ధన్ వాంతులు చేసుకుంటున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. అయితే కంగారు పడిపోయిన తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ అసలేం జరిగిందని ఆరా తీశారు. చివరకు తనకు నచ్చని కటింగ్ చేయించినందు వల్ల అది ఇష్టం లేక పురుగుల మందు తాగినట్లు హర్షవర్ధన్ అసలు విషయాన్ని బయట పెట్టాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలుడు గురువారం ఉదయం 8 గంటల సుమారులో ప్రాణాలు కోల్పోయాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.