Mahabubabad : నచ్చిన కటింగ్ చేయించ‌లేద‌ని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahabubabad : నచ్చిన కటింగ్ చేయించ‌లేద‌ని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,1:00 pm

Mahabubabad  : ఇటీవ‌లి కాలంలో పిల్ల‌లు చాలా సెన్సిటివ్‌గా మారుతున్నారు. చిన్న చిన్న వాటికి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేని హెయిర్ కట్టింగ్ చేయించాడని తండ్రి మీద కోపంతో ఓ తొమ్మిదేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విష‌యం తెలుసుకున్న పేరెంట్స్ బాలుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు గురువారం ప్రాణాలు విడిచాడు.

Mahabubabad  క‌టింగ్ బాగోలేదని..

వివ‌రాల‌లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న వాడైన ఈసం హర్షవర్థన్(9) సీతా నాగారంలోని హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదివాడు. అయితే వేసవి కాలం సెలవుల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలాఉంటే మే 25వ తేదీన ఈసం కాంతారావు తన కొడుకైన హర్షవర్ధన్ ను హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉన్న సెలూన్ షాప్ నకు తీసుకెళ్లాడు. అక్కడ తండ్రి కాంతారావు చెప్పిన ప్రకారం సెలూన్ షాప్ వ్యక్తి హర్షవర్ధన్ కు కటింగ్ చేయగా, అది ఆ బాలుడికి నచ్చలేదు. దీంతో తనకు నచ్చిన విధంగా కట్టింగ్ చేయించలేదని, ఆ స్టైల్ తనకు నచ్చలేదని తండ్రితో హర్ష వర్ధన్ గొడవ పడ్డాడు.

Mahabubabad నచ్చిన కటింగ్ చేయించ‌లేద‌ని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు

Mahabubabad : నచ్చిన కటింగ్ చేయించ‌లేద‌ని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు..!

హర్షవర్ధన్ కటింగ్ నచ్చలేదని గొడవ చేస్తుండటంతో చదువుకునే అబ్బాయికి హెయిర్ అలాగే ఉండాలని తండ్రి కాంతారావు నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు. కానీ హర్షవర్ధన్ ఎంతకూ వినకపోగా, అలాగే ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటి వెనకాల ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా, హర్ష వర్ధన్ వాంతులు చేసుకుంటున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. అయితే కంగారు పడిపోయిన తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ అసలేం జరిగిందని ఆరా తీశారు. చివరకు తనకు నచ్చని కటింగ్ చేయించినందు వల్ల అది ఇష్టం లేక పురుగుల మందు తాగినట్లు హర్షవర్ధన్ అసలు విషయాన్ని బయట పెట్టాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలుడు గురువారం ఉదయం 8 గంటల సుమారులో ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది