Priyanka Gandhi : తెలంగాణ ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న ప్రియాంక గాంధీ..!!

Advertisement

Priyanka Gandhi : తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన రెండు ఎన్నికలలో కేసీఆర్ పార్టీ అధికారం సాధించటం తెలిసిందే. కాగా మూడోసారి జరగబోతున్న ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టడానికి కేసీఆర్.. సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ఈసారి జరగబోయే ఎన్నికలలో పక్కా గెలవాలని రెడీ అవుతోంది. ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించి అధికారం సంపాదించడం జరిగింది.

Advertisement

ఇక తెలంగాణలో కూడా గెలవడానికి అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నాయకులు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంతో ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పలు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ప్రియాంక గాంధీ తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే తెలంగాణ పార్లమెంటు ఎన్నికలలో మెదక్ నుండి పోటీ చేయడానికి ప్రియాంక గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
priyanka gandhi is preparing to contest in telangana elections
priyanka gandhi is preparing to contest in telangana elections

ఈ రకంగా వచ్చే ఎన్నికలలో ప్రియాంక గాంధీ పోటీ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశం ఉండటంతో.. టీకాంగ్రెస్ నేతలు సైతం.. ప్రియాంక గాంధీ పోటీకి ఉత్సాహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన గాని ఇప్పటివరకు అధికారం దక్కకపోవడంతో ఈసారి కచ్చితంగా అధికారం సంపాదించడానికి కాంగ్రెస్.. జరగబోయే ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

Advertisement
Advertisement