Fine Rice Fistribution : ప్రజాసంక్షేమమే ప్రజ ప్రభుత్వ లక్ష్యం.. : తుంగతుర్తి రవి
ప్రధానాంశాలు:
fine rice distribution పీర్జాదిగూడలో సన్న బియ్యం పంపిణీ చేసిన తుంగతుర్తి రవి
fine rice distribution తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు.

Fine Rice Fistribution : ప్రజాసంక్షేమమే ప్రజ ప్రభుత్వ లక్ష్యం.. : తుంగతుర్తి రవి
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్,కాంగ్రెస్ నాయకులు వంగూరి పరమేష్,కొల్తూరి సాయి,ఉమేష్ రెడ్డి,జోగు సోమయ్య, మహేశ్వరప్ప, సాయి,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.