Raghunandan Rao : కాంగ్రెస్ గూటికి వెళుతున్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చిన రఘునందన్ రావు..!!
Raghunandan Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణానికి మారిపోతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రఘునందన్ రావు బీజేపీ పార్టీ కార్యక్రమాలలో మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.
ఇదే సమయంలో ఎటువంటి అసత్యలను ప్రచారం చేయొద్దని మీడియాకి విజ్ఞప్తి కూడా చేశారు. ఇదే సమయంలో త్వరలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీజేపీ పెద్దలు ఆదేశిస్తే సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు మీద పోటీ చేయడానికి అయినా తన సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గద్వాల్ లలో ఈటెల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్, కామారెడ్డిలో ధర్మపురి అరవింద్..బీజేపీ ఆదేశిస్తే పోటీకి రెడీగా ఉన్నట్లు తెలిపారు.
జమిలి ఎన్నికల ద్వారా తెలంగాణలో బిజెపికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో బీజేపీకి భయపడి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. జమీలి ఎన్నికల విధానం ద్వారా డబ్బు ఆదాతో పాటు సమయం కూడా వృధా కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.