Rajagopal Reddy : కాంగ్రెస్ పార్లమెంట్ ఇనచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. ఆయన చేసిన కామెంట్స్ ఎన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసిన కూడా తనదైన స్పీచ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారాయి.నాకు ఏదైనా కావాలి అనుకుంటేఅడగను.. లాక్కుంటా అని అన్నారు. నాకు కావల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిపించండి నేను మంత్రి అవుతా అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
నాకు హోమంత్రి కావాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. అధిష్ఠానం కూడా నాకు గతంలో హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేను హోం మంత్రి అయితేనే వాళ్లునియంత్రణలో ఉంటుంటారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి సహా అందర్నీ జైలుకు పంపుతా. నేను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు. కేసీఆర్‌ను గద్దె దించడానికే నేను కాంగ్రెస్‌లోకి వచ్చా. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది కాబట్టి హోమంత్రిని అవుతానని అన్నారు రాజగోపాల్‌రెడ్డి.
అసెంబ్లీ సమావేశాల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బీజేపీనే శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారంటూ కూడా జోస్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అందుకు కారణం ఇప్పుడు హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కీలకమైన శాఖ కావడంతో రేవంత్ రెడ్డి దానిని తనతోనే ఉంచుకున్నాడు. అయితే త్వరలో కేబినేట్ విస్తరణ ఉండడంతో రాజగోపాల్‌రెడ్డి ఏకంగా హోంశాఖకే ఎసరు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.