Rajagopal Reddy : నాకు హోం మంత్రి కావాలని ఉంది.. అయితే ముందు వాళ్లనే జైలుకి పంపేది : కోమటిరెడ్డి..!
Rajagopal Reddy : కాంగ్రెస్ పార్లమెంట్ ఇనచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. ఆయన చేసిన కామెంట్స్ ఎన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసిన కూడా తనదైన స్పీచ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారాయి.నాకు ఏదైనా కావాలి అనుకుంటేఅడగను.. లాక్కుంటా అని అన్నారు. నాకు కావల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ […]
ప్రధానాంశాలు:
Rajagopal Reddy : నాకు హోం మంత్రి కావాలని ఉంది.. అయితే ముందు వాళ్లనే జైలుకి పంపేది : కోమటిరెడ్డి..!
Rajagopal Reddy : కాంగ్రెస్ పార్లమెంట్ ఇనచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. ఆయన చేసిన కామెంట్స్ ఎన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసిన కూడా తనదైన స్పీచ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారాయి.నాకు ఏదైనా కావాలి అనుకుంటేఅడగను.. లాక్కుంటా అని అన్నారు. నాకు కావల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిపించండి నేను మంత్రి అవుతా అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
Rajagopal Reddy : హోం శాఖకి ఎసరు..
నాకు హోమంత్రి కావాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. అధిష్ఠానం కూడా నాకు గతంలో హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేను హోం మంత్రి అయితేనే వాళ్లునియంత్రణలో ఉంటుంటారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి సహా అందర్నీ జైలుకు పంపుతా. నేను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు. కేసీఆర్‌ను గద్దె దించడానికే నేను కాంగ్రెస్‌లోకి వచ్చా. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది కాబట్టి హోమంత్రిని అవుతానని అన్నారు రాజగోపాల్‌రెడ్డి.
అసెంబ్లీ సమావేశాల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బీజేపీనే శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారంటూ కూడా జోస్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అందుకు కారణం ఇప్పుడు హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కీలకమైన శాఖ కావడంతో రేవంత్ రెడ్డి దానిని తనతోనే ఉంచుకున్నాడు. అయితే త్వరలో కేబినేట్ విస్తరణ ఉండడంతో రాజగోపాల్‌రెడ్డి ఏకంగా హోంశాఖకే ఎసరు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
నాకు ఏదైనా కావాలి అంటే అడగను.. లాక్కుంటా
నాకు కావల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిపించండి నేను మంత్రి అవుతా.
నేను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదట జైలుకు పంపుతా.. నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్… pic.twitter.com/31YmgPcdVj
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024