Ration Card : ఆ పని చేయకపోతే మీ రేషన్ కార్డ్ రద్దవుతుంది.. ఇదే చివరి అవకాశం..!
ప్రధానాంశాలు:
Ration Card : ఆ పని చేయకపోతే మీ రేషన్ కార్డ్ రద్దవుతుంది.. ఇదే చివరి అవకాశం..!
Ration Card : తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు తెలియజేసింది.. వాస్తవానికి మార్చి 31 తేదీ వరకే ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం మరో నెల పొడిగింపు ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

Ration Card : ఆ పని చేయకపోతే మీ రేషన్ కార్డ్ రద్దవుతుంది.. ఇదే చివరి అవకాశం..!
Ration Card త్వరపడండి..
ఇదివరకు e-KYC పూర్తి చేయించుకోకపోతే, ఇప్పుడైనా చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చేసిన వారికే, రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ-కేవైసీ ప్రక్రియ చేయించుకుంటే.. ఆ వ్యక్తి వివరాలు పక్కాగా ఉంటాయి. రేషన్ పొందేందుకు అర్హులో కాదో తేలిపోతుంది. అర్హులైన వారికి మాత్రమే రేషన్ ఇస్తారు. అందుకే కేంద్రం ఇది తప్పక పూర్తి చెయ్యాలి అంటోంది.
ఏప్రిల్ 30 తర్వాత అంటే.. మే 1 నుంచి అర్హులైన వారికి మాత్రమే రేషన్ సరుకులు అందనున్నాయి. అందువల్ల అనర్హులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తారు.ఈకేవైసీ ప్రక్రియను డీలర్లను సంప్రదించి పూర్తి చేయవచ్చు. గడువు ముగుస్తుందని మార్చి నెలాఖరులో రేషన్ షాపులకు క్యూ కట్టడం, ఆన్ లైన్ పోర్టల్ లో ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం మరో నెలల రోజులు ఈకేవైసీ గడువు పొడిగించింది