Hydra Effect : హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఢమాల్.. సెప్టెంబర్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hydra Effect : హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఢమాల్.. సెప్టెంబర్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Hydra Effect : హైదరాబాద్ లో ఇల్లు కొనడమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరికి హైడ్రా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. చెరువుల దగ్గర ఎఫ్.టి.ఎల్ లో ఉన్న ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారు. దానిపై ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఐతే ఈ క్రమంలో హైదరాబాద్ లోని ప్రజలు ఆస్తుల పరిరక్షణ, విపత్తుల గురించి కంగారు పడుతున్నారు. ఐతే చెరువుల ఆక్రమణ, విపత్తుల నిర్వహణలో భాగంగానే హైడ్రా ఏర్పాటు చేశారు. జూలై […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Hydra Effect : హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఢమాల్.. సెప్టెంబర్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Hydra Effect : హైదరాబాద్ లో ఇల్లు కొనడమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరికి హైడ్రా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. చెరువుల దగ్గర ఎఫ్.టి.ఎల్ లో ఉన్న ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారు. దానిపై ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఐతే ఈ క్రమంలో హైదరాబాద్ లోని ప్రజలు ఆస్తుల పరిరక్షణ, విపత్తుల గురించి కంగారు పడుతున్నారు. ఐతే చెరువుల ఆక్రమణ, విపత్తుల నిర్వహణలో భాగంగానే హైడ్రా ఏర్పాటు చేశారు. జూలై 25న ఏర్పాటైన హైడ్రా రెండు నెలల్లోనే వంద ఎకరాల్లో ఆక్రమణకు గురైన బిల్డింగ్ లను తొలగించింది. ఇక తాజాగా మూసీ సుందరీకరణ పేరుతో బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను కూడా హైడ్రా కూర్చేందుకు సిద్ధమైంది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద బాగా ఉందనిపిస్తుంది. హైడ్రా వల్ల చాలా వరకు అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయాయి. గత సెప్టెంబర్ లో ఎప్పుడు జరిగే రిజిస్ట్రేషన్ల కన్నా 30 శాతం పడిపోయాయని తెలుస్తుంది.

Hydra Effect సెప్టెంబర్ నెలలో..

సెప్టెంబర్ లో హైదరాబాద్ లో 6185 రెసిడెన్షియన్ ప్రాపర్టీలు రిజిస్ట్రేట్ అయ్యాయి. 2022 లో ఈ నెలలో పోలిస్తే 30 శాతం తక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. సెప్టెమ్నర్ లో మొత్తం 3378 కోట్ల ఆస్తులు నమోదు అయ్యాయి. 42 శాతం పాటు ఇది పెరిగింది. హైదరాబా లో నివాసయోగ్యమైన మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు బాగున్నాయి. హైదరాబా లో పతిక లక్షల నుంచి 50 లక్షల దాకా ఆతి రిజిస్టేషన్లు జరిగాయి.

Hydra Effect హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఢమాల్ సెప్టెంబర్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Hydra Effect : హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఢమాల్.. సెప్టెంబర్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

2023 సెప్టెంబర్ లో 1000 నుంచి 2000 చదరపు అడుగుల పరిధిలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి. చిన్న గృహాలు డిమాండ్ మోడరేషన్ లో ఉన్నాయి. 2022 లో సెప్టెంబర్ 16 శాతం గా ఉన్న రిజిస్త్రేషన్ కేటగిరి 2023 నాటికి 14 శాతానికి పడిపోయాయి. సో హైడ్రా వల్ల హైదరాబాద్ లో రియల్ పెట్టుబడులు, రెసిడెన్షియల్ ఫ్లాట్ లను కూడా కొనేందుకు ఆసక్తి చూపట్లేదని చెప్పొచ్చు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది