Revanth Reddy : నన్ను జైల్లో పెట్టి హింసించిన కక్ష్య కట్టలేదు.. అలా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ అంతా జైల్లో ఉండేవారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కక్షపూరిత రాజకీయాలపై తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇలాంటి రాజకీయాలకు దూరమని, తాము కూడా కక్షపూరిత రాజకీయాలను చేస్తే ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీ అంతా చంచల్ గూడ జైల్లో ఉండేవారని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ. 500 జరిమానా విధిస్తారని… కానీ, అప్పట్లో ఎంపీగా ఉన్న తాను డ్రోన్ ఎగరవేశానని జైల్లో పెట్టి వేధించారని మండిపడ్డారు.

Revanth Reddy : నన్ను జైల్లో పెట్టి హింసించిన కక్ష్య కట్టలేదు.. అలా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ అంతా జైల్లో ఉండేవారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy విమర్శల పర్వం..
తన కూతురు పెళ్లికి కూడా తాను బెయిల్ పై వచ్చి మళ్లీ జైలుకు వెళ్లానని తెలిపారు. ప్రతీకార రాజకీయాలను తాను కూడా చేయాలనుకుని ఉంటే… ఈ పాటికే కొందరు జైల్లో ఉండేవారని రేవంత్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని తమను చాలా మంది అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు బనాయించి, వాళ్లను జైళ్లకు పంపే నీచ రాజకీయాలను తాను చేయనని చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్టేషన్ పనికిరాదు. జీవితంలో అక్కడ కూర్చోవాలనుకున్నాడు.. కూర్చున్నాడు కాబట్టి కూల్ కావాలి.. ఎందుకింత ఫ్రస్టేషనో, ఎందుకింత నిస్పృహనో, ఎందుకింత ఆవేశమో మాకైతే అర్థం కావడం లేదు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు. రామునా.. రెమోనా.. ఎవరు కరెక్టో తెలుస్తలేదు అని కేటీఆర్ విమర్శించారు.