Revanth Reddy : CM రేవంత్ ని ధైర్యంగా ప్రశ్నించిన యువతీ .. శభాష్ తల్లీ..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : CM రేవంత్ ని ధైర్యంగా ప్రశ్నించిన యువతీ .. శభాష్ తల్లీ
Revanth Reddy : సమాజంలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ మార్పు కోసం అడుగు ముందుకు వేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా చదువుకునే వయసులో ఉన్న పిల్లలు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడం అంటే అది మామూలు విషయం కాదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని చేసిన పని ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న మహిమా కీర్తన సిరంగి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఈ అమ్మాయి కేవలం విద్యార్థిని మాత్రమే కాదు ఒక జాతీయ స్థాయి రైఫిల్ షూటర్ కూడా. షూటింగ్‌లో గురి తప్పని ఈ అమ్మాయి ఇప్పుడు పరీక్షా పత్రాల్లోని లింగ వివక్షపై తన గళాన్ని విప్పింది.
Revanth Reddy : CM రేవంత్ ని ధైర్యంగా ప్రశ్నించిన యువతీ .. శభాష్ తల్లీ..!
Revanth Reddy : లింగ వివక్ష లేని విద్యా వ్యవస్థ కోసం పోరాటం
ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షా పత్రంలో ఒక ప్రశ్న కీర్తనను తీవ్రంగా కలచివేసింది. డైలాగ్ రైటింగ్ విభాగంలో ఇచ్చిన ఆ ప్రశ్నల్లో ఒకటి తల్లి తన కూతురికి వంట నేర్చుకోమని చెప్పడం గురించి కాగా మరొకటి తండ్రి తన కొడుకుతో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం గురించి ఉంది. ఈ విషయాన్ని గమనించిన కీర్తన అసలు 2026వ సంవత్సరంలో కూడా మనం ఇంకా ఇలాంటి పాతకాలపు ఆలోచనలతోనే ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలు అంటే కేవలం వంట గదికే పరిమితం కావాలని అబ్బాయిలు మాత్రమే తమ కెరీర్ గురించి ఆలోచించాలని చెప్పకనే చెబుతున్న ఈ ప్రశ్నలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.
వంట అనేది కేవలం ఆడవారికి సంబంధించిన పని మాత్రమే కాదని అది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక జీవన నైపుణ్యం అని కీర్తన తన లేఖలో స్పష్టం చేసింది. తన ఇంట్లో తన తండ్రి కూడా వంట చేస్తారని అలాంటప్పుడు పుస్తకాల్లో మరియు పరీక్షల్లో ఇలాంటి వివక్ష ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించింది. చదువుకునే వయసులో పిల్లల మెదడులో ఇలాంటి భావాలను చొప్పించడం వల్ల సమాజంలో లింగ సమానత్వం రాదని ఆమె సీఎంకు వివరించింది. షూటింగ్‌లో పతకాలు సాధించడమే కాకుండా నల్సార్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు సంపాదించిన కీర్తన వంటి అమ్మాయిలకు వంట నేర్చుకోమని సలహా ఇచ్చే ప్రశ్నలు రావడం విచారకరం.
ముఖ్యమంత్రికి కీర్తన చేసిన విజ్ఞప్తి చాలా గొప్పది. పాఠ్యపుస్తకాల్లో మరియు పరీక్షా పత్రాల్లో ఉండే ఇలాంటి లింగ వివక్షతో కూడిన అంశాలను వెంటనే తొలగించాలని ఆమె కోరింది. మహిళా సాధికారత గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో విద్యా వ్యవస్థలోనే ఇలాంటి మూస పద్ధతులు ఉండటం సరికాదని ఆమె అభిప్రాయపడింది. ఒక సామాన్య విద్యార్థిని అయి ఉండి కూడా వ్యవస్థలోని లోపాన్ని గుర్తించి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించిన కీర్తన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడే రేపటి తరం సమానత్వంతో ముందుకు వెళ్తుంది. అందుకే అంటున్నాం శభాష్ తల్లీ నీ ధైర్యానికి మరియు నీ ఆలోచనా దృక్పథానికి ఒక పెద్ద సెల్యూట్.