Revanth Reddy : తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. కాసేపట్లో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. కాసేపట్లో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

Revanth Reddy : తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్ననే ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 4 సీట్లను ఎక్కువే సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ ఉదయం జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత రేవంత్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  రాజ్ భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

  •  ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన కాంగ్రెస్

  •  డిప్యూటీ సీఎంలుగా భట్టి, సీతక్క

Revanth Reddy : తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్ననే ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 4 సీట్లను ఎక్కువే సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ ఉదయం జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.

దీంతో ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో రాత్రి 8.30 కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మరోవైపు రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు జరుగుతున్నాయి. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, సీతక్కలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉంది.

ఐటీ మంత్రిగా మధన్ మోహన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. మధన్ మోహన్ ఐటీ రంగంలోనే ఇది వరకు పని చేశారు. అందుకే ఆయన పేరు వినిపిస్తోంది. హోంమంత్రి, ఇతర శాఖలను ఎవరికి అప్పగిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈరోజు రాత్రి రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది