Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్ఫమ్ అయ్యారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. డిసెంబర్ 3 నుంచి కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు తాజాగా తెర పడింది. ఏఐసీసీ హైకమాండ్ రేవంత్ రెడ్డికే ఓటు వేసింది. టీపీసీసీ చీఫ్ గా ఉండటమే కాదు.. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు. సీఎంగా రేవంత్ రెడ్డి వైపే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మొగ్గు చూపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉండి తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై హైకమాండ్ తో చర్చించారు. చివరకు హైకమాండ్ రేవంత్ రెడ్డికే ఓటు వేసింది. దీంతో ఏఐసీసీ పరిశీలకులు.. హైకమాండ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలిపారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా 7 డిసెంబర్, 2023న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉండనుంది. రేవంత్ రెడ్డితో తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే సీఎం కొత్త కాన్వాయ్ ని కూడా రెడీ చేశారు.
ఇక.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని తెలియగానే.. ఆయన వెంటనే ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి హోటల్ లోనే బస చేస్తున్నారు. తాజాగా ఆయన్ను హైకమాండ్ ఢిల్లీకి పిలవడంతో వెంటనే రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే. వీళ్ల అందరి సమక్షంలో హైకమాండ్ మంత్రి వర్గం కూర్పు, డిప్యూటీ సీఎం లాంటి విషయాలపై చర్చించే అవకాశం ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.