CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి అయి 24 గంటలు కాలేదు.. అప్పుడే టీడీపీకి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి
ప్రధానాంశాలు:
ప్రగతి భవన్ కంచె తొలగింపు
కాంగ్రెస్ పార్టీ గెలుపులో టీడీపీ పాత్ర కీలకం
టీడీపీని కలుపుకొని పోవాలని కేడర్ కు ఆదేశాలు
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి.. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి. అవును.. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయి రికార్డు సాధించారు రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నుంచి తొలి ముఖ్యమంత్రి అయిన నేత కూడా రేవంత్ రెడ్డి. గత వారం రోజుల నుంచి తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ భారత్ అంతా రేవంత్ పేరు మారుమోగిపోతోంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆరు గ్యారెంటీ హామీలపై రేవంత్ తన తొలి సంతకం పెట్టారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన మాట ప్రకారం జాబ్ ఇప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెలు కూడా తొలగించారు. ప్రగతి భవన్ లోకి సామాన్యులకు అవకాశం కల్పించారు. ఇవాళ ఉదయమే ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వినతి పత్రం అందజేస్తే వెంటనే ఆ సమస్యలను తీర్చే దిశగా సీఎం శ్రద్ధ తీసుకొని మరీ ఆ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే తనదైన మార్క్ ను చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి.
అయితే.. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే పనులు తెలంగాణలో టీడీపీకి పాజిటివ్ సైన్ గా కనిపిస్తున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి టీడీపీని వదిలేసినా టీడీపీ పార్టీ విషయంలో మాత్రం ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు విషయంలో టీడీపీ పాత్ర కూడా అమోఘం అని చెప్పుకోవాలి. ఏపీలో ఉన్న టీడీపీని వదిలేస్తే.. తెలంగాణలో టీడీపీ మాత్రం కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చింది. గాంధీ భవన్ లోనూ టీడీపీ జెండాలు ఎగిరాయి. రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక.. ఆయన సీఎం అవ్వగానే తన కేడర్ తో పాటు టీడీపీ కేడర్ కలిసి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కేడర్, టీడీపీ కేడర్ ను కలుపుకొని వెళ్లాలని ముందే చెప్పారట. ఆ సందేశాన్ని లోకల్ కేడర్ కు చెప్పారట. తెలంగాణలో టీడీపీ కేడర్ ఎక్కడ ఉందో.. అక్కడ కాంగ్రెస్ కేడర్ కలుపుకొని వెళ్లాలని చెప్పారట. ఒకరకంగా చెప్పాలంటే ఆయన ఆదేశాలు జారీ చేశారనే చెప్పుకోవాలి.
CM Revanth Reddy : ఈ విషయంలో రేవంత్ కరెక్టేనా?
కాంగ్రెస్ పార్టీ గెలుపులో టీడీపీ పాత్ర ఉన్నప్పటికీ.. టీడీపీని కాంగ్రెస్ కలుపుకొని పోవడం ఎంత వరకు కరెక్ట్. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎంత మేరకు రేవంత్ కు ప్లస్ అవుతాయో తెలియదు కానీ.. ఇది ఏపీలో మాత్రం ఖచ్చితంగా టీడీపీకి నెగెటివ్ అయ్యే అవకాశం ఉంది. అది చంద్రబాబు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్ని రోజుల్లో ఏపీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీ నేతలు కూడా ఆచీతూచీ అడుగు వేస్తే మంచిది అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.