Revanth Reddy : సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్.. ఆయ‌న చెప్పిన‌ట్టు సెల‌బ్స్ వింటారా.. లేదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్.. ఆయ‌న చెప్పిన‌ట్టు సెల‌బ్స్ వింటారా.. లేదా..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్.. ఆయ‌న చెప్పిన‌ట్టు సెల‌బ్స్ వింటారా.. లేదా..!

Revanth Reddy : డ్ర‌గ్స్ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. డ్ర‌గ్స్ అనేది తెలంగాణ‌లో లేకుండా చేయాల‌ని ఆయ‌న కంక‌ణం క‌ట్టుకున్నారు. తెలంగాణ‌ను డ్రగ్స్ ర‌హిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తూ వ‌స్తున్నారు. అయితే ఇటీవ‌ల జరిగిన కార్య‌క్ర‌మంలో డ్రగ్స్ సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలంటూ సూచించారు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.కేవలం సినిమా టికెట్ల ధర పెంపు కోసమో.. లేదా షూటింగుల అనుమతుల కోసం సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దు .. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Revanth Reddy అది ఫాలో అవుతారా..

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ… చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయం అని తెలిపారు. అయితే, మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేకం ప్రచారంలో పాల్గొనడంలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Revanth Reddy సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్ ఆయ‌న చెప్పిన‌ట్టు సెల‌బ్స్ వింటారా లేదా

Revanth Reddy : సినిమా వాళ్లకి రేవంత్ మాస్ వార్నింగ్.. ఆయ‌న చెప్పిన‌ట్టు సెల‌బ్స్ వింటారా.. లేదా..!

డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి స్ఫూర్తిగా అందరూ ఉద్యమంలో పాలుపంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం ట్వీట్ చేయ‌గా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “థాంక్యూ రేవంత్ రెడ్డి గారూ… ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను అని స్పందించారు. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్ విష‌యం గురించి ఇప్ప‌డు సినిమా ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ న‌డుస్తుంది. రేవంత్ వ్యాఖ్య‌లని సినిమా ప‌రిశ్ర‌మ ప‌రిగ‌ణలోకి తీసుకొని ముందుకు సాగుతుందా లేదా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది