Revanth Reddy : మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. లక్ష రూపాయలు, తులం బంగారం నిధులు విడుదల..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. లక్ష రూపాయలు, తులం బంగారం నిధులు విడుదల..!
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అందిస్తుండగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత కరెంటు , ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ , ఆరోగ్యశ్రీ పెంపు వంటి హామీలను కూడా నెరవేర్చుతూ వస్తున్నారు. అయితే వీటిలో కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు కూడా అమలులో ఉండటం వలన వాటన్నింటికీ బ్రేక్ పడింది. ఇక లోక్ సభ ఫలితాలు విడుదలైన వెంటనే మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ముఖ్యమైన పథకం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పథకంలో భాగంగా లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం కూడా ఇవ్వనున్నారు.
Revanth Reddy కల్యాణ లక్ష్మి…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలలో కల్యాణ లక్ష్మి పథకం కూడా ఒకటి. ఇక ఈ పథకంలో భాగంగా పెళ్లయిన మహిళలకు లక్ష రూపాయలు నగదు తో పాటు తులం బంగారం ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ స్కీమ్ అమలు చేసేందుకు రేవంత్ సర్కర్ కృషి చేస్తుంది. ఇక ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న యువతులకు లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం ఇవ్వనున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన నిధులను ఇటీవల కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసింది. 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు రూ.725 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం నిధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా కల్యాణ లక్ష్మి పథకం అమలుపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలలో కూడా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ పథకం అమలును సవాలుగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఈ మేరకు ఇటీవల ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు.