Revanth Reddy : తెలంగాణను ఆగంజేసి.. మళ్లీ అధికారం ఇవ్వాలని ఆడుగుతావా ? కేసీఆర్ పై రేవంత్ చిందులు..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : తెలంగాణను ఆగంజేసి.. మళ్లీ అధికారం ఇవ్వాలని ఆడుగుతావా ? కేసీఆర్ పై రేవంత్ చిందులు..!
Revanth Reddy : తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ చెలరేగాయి. బీఆర్ఎస్ వజ్రోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. అసెంబ్లీకి రాని వారు ప్రతిపక్ష హోదా ఎలా కోరగలరని ప్రశ్నించిన రేవంత్, ఫామ్‌హౌస్ నుంచి బయటికి రావాలంటే అధికారమే అవసరమా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. తాము పదేళ్లు అధికారంలో ఉంటామని.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆగంజేసి మళ్లీ అధికారం అడుగుతారా? అంటూ హెచ్చరించారు.

Revanth Reddy : తెలంగాణను ఆగంజేసి.. మళ్లీ అధికారం ఇవ్వాలని ఆడుగుతావా ? కేసీఆర్ పై రేవంత్ చిందులు..!
revanth reddy తెలంగాణను ఆగంజేసి.. మళ్లీ అధికారం ఇవ్వాలని ఆడుగుతావా ? కేసీఆర్ పై రేవంత్ చిందులు
కేసీఆర్ వ్యాఖ్యల్లో ప్రభుత్వం పథకాలను ఆపేసిందని వచ్చిన ఆరోపణలపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉచిత కరెంట్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు కొనసాగుతున్నాయని, ఒక పథకం ఆగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఈ పనులు కనబడకపోవడం రాజకీయ స్వార్థమేనని ఆరోపించారు. ప్రజల కంటే కుటుంబాన్ని మెచ్చిన పాలన కొనసాగించి, ఇప్పుడు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని చెప్పారు.
కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, పదేళ్ల పాలనపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధమని వెల్లడించిన సీఎం రేవంత్, తాము చేసిన తప్పులు ఉంటే సరిచేసుకుంటామని చెప్పారు. కేసీఆర్ కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చినందుకు విమర్శలు హక్కు లేదన్నారు. ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికే ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పాలన ఎలా సాగిందో రాష్ట్ర ప్రజలకు తెలిసిందని విరుచుకుపడ్డారు.