Indiramma Atmiya Bharosa : గుడ్‌న్యూస్.. మహిళల ఖాతాల్లోకి రూ.12 వేలు.. ముహూర్తం ఫిక్స్..!
ప్రధానాంశాలు:
Indiramma Atmiya Bharosa : గుడ్‌న్యూస్.. మహిళల ఖాతాల్లోకి రూ.12 వేలు.. ఈ నెల 26న ముహూర్తం ఫిక్స్..!
Indiramma Atmiya Bharosa : ఈ నెల 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుంది. 2023 – 24 లో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఒక వేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలు ఉంటే వయస్సులో పెద్ద వారి ఖాతాలో జమ చేయనున్నారు.
Indiramma Atmiya Bharosa పొరపాట్లు సరిదిద్దాలి
ఈ పథకం కింద ఏడాది రూ.12 వేల ఆర్థిక సాయం నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదన్నారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6 వేలు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
సామాజిక స్పృహతో వ్యవహరించాలి
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం నాలుగు విడతల్లో 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్ల మాఫీ సొమ్మును జమ చేశారు. తాజాగా పంట పెట్టుబడి సాయం రైతు భరోసా, రాష్ట్రంలోని నిరుపేద రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకాలు అమలు చేయనున్నారు.
సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో అధికారులు సామాజిక స్పృహతో వ్యవహరించాలన్నారు. సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.