Rythu Bharosa : రైతు భరోసా విషయంలో గత కొద్ది రోజులుగా అందరిలో అనేక అనుమానాలు ఉండగా, వాటిపై ఓ క్లారిటీ అయితే వచ్చింది. రైతు భరోసా పథకం నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతు భరోసా Rythu Bharosa నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుంది కనుక కొన్ని జిల్లాలలో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనపడుతుందని తుమ్మల స్పష్టం చేశారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా నిధుల జమకూడా కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అర్హులైన ప్రతిరైతుకు రైతుభరోసా Rythu Bharosa నిధులను జమచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాగుయోగ్యం కాని భూముల గుర్తింపు సర్వేకొనసాగుతుందని ఆయన వివరించారు.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా Rythu Bharosa, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. సొంత నియోజవకర్గం కొండగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు పథకాలను ప్రారంచించారు. ఆ మరుసటి రోజే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఫిబ్రవరి 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరాకు పంట పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వనుండగా.. తొలి విడత సొమ్ము కింద ఎకరాకు రూ.6 వేలు జమ చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులని 600 గ్రామాలలోనే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాలలో చేసే అవకాశం ఉంది. ముందు గ్రామాలలోనే ఈ రెండు స్కీమ్స్ అమలు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
Palmyra Sprout : మనం రోడ్డు మీద అమ్ముతూ ఉన్న తేగలని చూస్తూనే ఉంటాం.' తేగ ' అనేది ఒక…
Union Budget 2025 : ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం శనివారం (2025 ఫిబ్రవరి 1)న ఉదయం…
Union Budget 2025 : బడ్జెట్ 2025 చాలా చారిత్రాత్మకమైనది అని చెప్పవచ్చు. ఈ ఏడాది పేదలు, యువత, మహిళలు,రైతుల…
Union Budget 2025 : రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman లోక్ సభలో దేశ బడ్జెట్…
Union Budget 2025 : బడ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్‌లు ప్రకటిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman budget వరుసగా 8వ సారి…
Anti-Cancer Diet : మనకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఎన్నో ఉన్నాయి. అటువంటి పండ్లలో ముఖ్యమైన పండు 'కివి'…
This website uses cookies.