Rythu Bharosa : గ్రామాల వారీగా రైతు భరోసా నగదు బదిలీ.. ఎల్లుండి నుండి అకౌంట్లోకి డబ్బులు..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : గ్రామాల వారీగా రైతు భరోసా నగదు బదిలీ.. ఎల్లుండి నుండి అకౌంట్లోకి డబ్బులు..!
Rythu Bharosa : రైతు భరోసా విషయంలో గత కొద్ది రోజులుగా అందరిలో అనేక అనుమానాలు ఉండగా, వాటిపై ఓ క్లారిటీ అయితే వచ్చింది. రైతు భరోసా పథకం నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతు భరోసా Rythu Bharosa నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుంది కనుక కొన్ని జిల్లాలలో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనపడుతుందని తుమ్మల స్పష్టం చేశారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా నిధుల జమకూడా కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అర్హులైన ప్రతిరైతుకు రైతుభరోసా Rythu Bharosa నిధులను జమచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాగుయోగ్యం కాని భూముల గుర్తింపు సర్వేకొనసాగుతుందని ఆయన వివరించారు.
Rythu Bharosa గ్రామాల వారీగా..
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా Rythu Bharosa, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. సొంత నియోజవకర్గం కొండగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు పథకాలను ప్రారంచించారు. ఆ మరుసటి రోజే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఫిబ్రవరి 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరాకు పంట పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వనుండగా.. తొలి విడత సొమ్ము కింద ఎకరాకు రూ.6 వేలు జమ చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులని 600 గ్రామాలలోనే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాలలో చేసే అవకాశం ఉంది. ముందు గ్రామాలలోనే ఈ రెండు స్కీమ్స్ అమలు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.