Home » News » Rythu Bharosa To All Farmers Says Mallu Bhatti Vikramarka
News

Rythu Bharosa : చెప్పండి ధైర్యంగా… వంద ఎక‌రాలున్న రైతు భ‌రోసా వేస్తాం.. డిప్యూటీ సీఎం..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 9, 2025, 5:22 pm
Advertisement

Rythu Bharosa : రాష్ట్ర వనరులు మరియు సంపదను Rythu Bharosa ప్రజలకు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడే రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామ‌ని చెప్పిన విధంగానే ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలో రైతు భ‌రోసా నిధులు జ‌మ చేస్తామ‌ని తెలిపారు. వ‌న‌ప‌ర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరులో కొత్తగా ఏర్పాటు చేసిన 33/11kv విద్యుత్ సబ్ స్టేషన్‌ను గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ..

Advertisement

Rythu Bharosa : చెప్పండి ధైర్యంగా… వంద ఎక‌రాలున్న రైతు భ‌రోసా వేస్తాం.. డిప్యూటీ సీఎం..!

Rythu Bharosa జ‌న‌వ‌రి 26,  8,400 కోట్ల రూపాయ‌లు రైతుల అకౌంట్‌లోకి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని ఆయ‌న అన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో గ్రామాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఈ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

రైతులంద‌రికీ రైతు భ‌రోసా అంద‌జేస్తామ‌న్నారు. ఐదు ఎక‌రాలకో, ప‌ది ఎక‌రాల‌కో కాదని, ఎటువంటి ష‌ర‌తులు లేకుండా వ్య‌వ‌సాయేత‌ర భూములన్నింటికీ కూడా ఎక‌రాకు 12 వేల రూపాయ‌లు ఇచ్చేటువంటి కార్య‌క్ర‌మాన్ని త‌మ‌ ప్ర‌భుత్వం, ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు 8,400 కోట్ల రూపాయ‌లు రైతుల అకౌంట్‌లోకి వేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి