Rythu Bharosa : చెప్పండి ధైర్యంగా… వంద ఎకరాలున్న రైతు భరోసా వేస్తాం.. డిప్యూటీ సీఎం..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : చెప్పండి ధైర్యంగా... వంద ఎకరాలున్న రైతు భరోసా వేస్తాం.. డిప్యూటీ సీఎం..!
Rythu Bharosa : రాష్ట్ర వనరులు మరియు సంపదను Rythu Bharosa ప్రజలకు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడే రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని చెప్పిన విధంగానే ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరులో కొత్తగా ఏర్పాటు చేసిన 33/11kv విద్యుత్ సబ్ స్టేషన్‌ను గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..
Rythu Bharosa జనవరి 26, 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్‌లోకి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో గ్రామాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఈ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామన్నారు. ఐదు ఎకరాలకో, పది ఎకరాలకో కాదని, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయేతర భూములన్నింటికీ కూడా ఎకరాకు 12 వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్లు 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్‌లోకి వేయబోతున్నట్లు పేర్కొన్నారు.