Rythu Bharosa : ఆ భూములకు కూడా రైతు భరోసా : ప్ర‌భుత్వం క్లారిటీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bharosa : ఆ భూములకు కూడా రైతు భరోసా : ప్ర‌భుత్వం క్లారిటీ

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : ఆ భూములకు కూడా రైతు భరోసా : ప్ర‌భుత్వం క్లారిటీ

Rythu Bharosa : జనవరి 26 తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా నిధులు Rythu Bharosa అందనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి చేసింది. నిధులు విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసింది. అయితే సాగులోని భూముల‌కే రైతు భ‌రోసా వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భూమి ఉన్నా ఆ సీజన్‌లో పంట వేయకుంటే భరోసా నిధులు రావంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలోని మొత్తం 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి వర్తించేలా పథకాన్ని రూపొందించారు. దీంతో 64 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంటే దాదాపు 12 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. ఈ నెల 20 వరకు అర్హుల ఎంపిక జరుగుతుంది. 26 నుంచి రైతుల అకౌంట్లలో భరోసా నిధులు జమ అవుతాయి. ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున, ఏడాదికి రూ.12 వేలు రైతులకు అంద‌నున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.9 వేల కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. మ‌రోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూమిలేని ఉపాధి హామీ కూలిలకు ఏడాదికి రూ.12 వేలు ఆత్మీయ భరోసా లభించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్ర‌భుత్వం రూ.700 కోట్లు విడుదల చేయనుంది…

Rythu Bharosa ఆ భూములకు కూడా రైతు భరోసా ప్ర‌భుత్వం క్లారిటీ

Rythu Bharosa : ఆ భూములకు కూడా రైతు భరోసా : ప్ర‌భుత్వం క్లారిటీ

రైతు భరోసా వ‌ర్తించ‌నివి..

– మైనింగ్‌, కొండలు, గుట్టలున్న భూమి
– రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రహదారులు
– నివాస, పారిశ్రామిక, వాణిజ్య భూములు
– నాలా కన్వర్టెడ్‌ భూములు
– ప్రభుత్వం సేకరించిన భూములకు వర్తించదని తేల్చి చెప్పింది రేవంత్‌ సర్కారు.

రైతు భరోసా దేనికి వర్తించేవి..

– వ్యవసాయ సాగు భూమి
– సాగుకు యోగ్యమైన భూములకు. అంటే ఆ సీజన్‌లో పంట వేయకున్నా సాగులో ఉన్న భూమి అయితే చాలు

రైతు భరోసాకు సంబంధించి ప్ర‌భుత్వం రెండు, మూడు రోజుల్లో మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయ‌నుంది. సంక్షేమ పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం రుణాలపై ఆధారపడుతున్నందున‌ భూస్వాములకు, ధనవంతులకు రైతు భ‌రోసా ఇవ్వ‌డం మంచిది కాదు అని భావిస్తుంది. స్థూల అంచనాల ప్రకారం, రాబోయే నాలుగేళ్లలో రైతు భరోసా కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ.15,600 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ విధంగా మొత్తం రూ.62,400 కోట్లు అవుతుంది. ఇంత పెద్దమొత్తం రాబట్టడం ప్రభుత్వానికి అంత సులువు కాదని విశ్లేష‌కులు అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది