Indiramma Housing Scheme : పేదలకి ఇందిరమ్మ ఇళ్లు.. కొత్త నిబంధనలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రధానాంశాలు:
Indiramma Housing Scheme : పేదలకి ఇందిరమ్మ ఇళ్లు.. కొత్త నిబంధనలు జారీ చేసిన ప్రభుత్వం
Indiramma Housing Scheme : తెలగాణ ప్రభుత్వం Telangana Govt కొత్త పథకాలు అమలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను Indiramma Housing Scheme ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy సర్కారు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల Indiramma Housing Scheme సంగతి కూడా తేల్చేయాలని ప్రభుత్వం రెడీ అయ్యింది. ముందుగా ఇళ్ల స్థలాలు ఉన్నవారికి 4 విడతల్లో రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ పథకానికి నిబంధనలు జారీ అయ్యయి.
Indiramma Housing Scheme ఇవి నిబంధనలు..
ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత జాగా చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే స్వయంగా ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. ముందు చెప్పిన జాగాలో కాకుండా మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు.ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కార్యదర్శి క్షేత్రస్థాయికి వచ్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు.
ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం ఉండదు. పునాది పూర్తయిన తర్వాతే తొలి విడతలో రూ.లక్షను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కూపన్లను ఎమ్మార్వో లేదా ఆర్డీవో ద్వారా అందించనున్నారు.సిమెంటు, స్టీలు వంటి నిర్మాణ సామగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందిస్తారు.