CM Revanth Reddy : హైదరాబాద్ లో చేప‌డుతున్న‌ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి స‌మీక్ష సీఎం రేవంత్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : హైదరాబాద్ లో చేప‌డుతున్న‌ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి స‌మీక్ష సీఎం రేవంత్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2025,10:49 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : హైదరాబాద్ లో చేప‌డుతున్న‌ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి స‌మీక్ష సీఎం రేవంత్‌..!

CM Revanth Reddy : హైదరాబాద్ నగరంలో Hyderabad మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth reddy గారు ఆదేశించారు. Greater Hyderabad  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.

CM Revanth Reddy హైదరాబాద్ లో చేప‌డుతున్న‌ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి స‌మీక్ష సీఎం రేవంత్‌

CM Revanth Reddy : హైదరాబాద్ లో చేప‌డుతున్న‌ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి స‌మీక్ష సీఎం రేవంత్‌..!

CM Revanth Reddy ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి స‌మీక్ష

మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటు 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ అంశాలపై రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో మరోసారి సమీక్షకు రావాలని చెప్పారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది