Telangana : నేటి నుండి తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ప్రారంభం ..

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 21, 2026, 9:20 pm
  •  Telangana : నేటి నుండి తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ప్రారంభం ..

Telangana : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ Congress  (డీసీసీ) అధ్యక్షులకు ఈ రోజు నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. అలాగే టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ కూడా పాల్గొని పార్టీ భవిష్యత్ దిశ రాబోయే రాజకీయ వ్యూహాలు, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణలో పార్టీ పాత్రను బలోపేతం చేయడం వంటి అంశాలపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Special training camps for Telangana DCC presidents begin from today

Telangana : నేటి నుండి తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ప్రారంభం ..

ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా శిబిరానికి హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీసీసీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. శిక్షణ శిబిరంలో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల ప్రచారం వంటి అంశాలపై చర్చలు సాగాయి. ప్రజలతో సమన్వయం పెంపొందించుకునే విధానాలు, యువత మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంచే వ్యూహాలు కూడా ప్రధానంగా చర్చించబడ్డాయి. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం చేకూరుతుందని రాబోయే ఎన్నికలలో విజయానికి బలమైన పునాది వేయబడుతుందని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp