Bandi Sanjay – Etela Rajender : బండి సంజయ్ VS ఈటల రాజేందర్ ల మధ్య ముదురుతున్న వార్
ప్రధానాంశాలు:
బండి సంజయ్, ఈటల రాజేందర్ వార్ ను చల్లార్చేది అధిష్టానమే !!
Bandi Sanjay - Etala Rajender : బండి సంజయ్ VS ఈటల రాజేందర్ ల మధ్య ముదురుతున్న వార్
Bandi Sanjay – Etela Rajender : తెలంగాణ బీజేపీలో Telangana BJP కీలక నాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం మళ్లీ భగ్గుమంది. హుజూరాబాద్‌లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఈటల తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో స్ట్రీట్ ఫైట్ కాకుండా స్ట్రైట్ ఫైట్ జరగాలంటూ స్పష్టం చేశారు. శత్రువులతో పోరాటం సాధ్యమవుతుందని, కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో ముందుకు సాగలేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ముందుకు వచ్చిన తాను, కేసీఆర్ విషయంలో ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తు చేస్తూ, హుజూరాబాద్ ప్రజలే తనకు అండగా నిలిచారన్న మాట చెప్పారు.

Bandi Sanjay – Etela Rajender : బండి సంజయ్ VS ఈటల రాజేందర్ ల మధ్య ముదురుతున్న వార్
Bandi Sanjay – Etela Rajender బండి సంజయ్, ఈటల రాజేందర్ గొడవ పై రాష్ట్ర బిజెపి ఏమంటుందంటే !!
ఈటల ఇంటివద్ద శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడారు. ఈటల మాట్లాడుతూ, హుజూరాబాద్ తెలంగాణ స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాలు సమన్వయంతో ఉండాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీలో చేరేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నానని అన్నారు. తాను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా మంత్రి పదవిని పొందానని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించానని తెలిపారు.
ఇదిలా ఉండగా బండి సంజయ్ – ఈటల మధ్య వాగ్వాదం బీజేపీలో పెరిగిపోతున్న ఫ్యాక్షన్ల రాజకీయానికి నిదర్శనంగా మారింది. మీడియా వేదికగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం, కార్యకర్తల సమావేశంలో ఈటల స్పందించడం పార్టీ అంతర్గత విభేదాలను బహిరంగం చేశాయి. ఈటల వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని తెలిపింది. ఈ పరిణామాలు బీజేపీ తీరుపై ప్రశ్నలు వేస్తుండగా, సమన్వయం లేకుండా పార్టీ కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అది ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.