PM Internship Scheme 2025 : విద్యార్థులకు నెలకు 5 వేలు పొందే ఛాన్స్..ఈరోజు వరకే అవకాశం
ప్రధానాంశాలు:
PM Internship Scheme 2025 : విద్యార్థులకు నెలకు 5 వేలు పొందే ఛాన్స్..ఈరోజు వరకే అవకాశం
PM Internship Scheme 2025 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ 2025 ప్రోగ్రామ్ నిరుద్యోగ యువతకు మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు 5 వేల రూపాయల స్టైపెండ్ అందుకోవడమే కాకుండా, వివిధ రంగాల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. విద్యార్థుల అధిక ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని, దరఖాస్తు గడువును మార్చి 12, 2025 వరకు పొడిగించారు. అంటే అభ్యర్థులు ఈరోజు రాత్రి 11:59 గంటల లోపు తమ దరఖాస్తును pminternship.mca.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించుకోవచ్చు.

PM Internship Scheme 2025 : విద్యార్థులకు నెలకు 5 వేలు పొందే ఛాన్స్..ఈరోజు వరకే అవకాశం
ఈ ఇంటర్న్‌షిప్ మొత్తం 12 నెలలు కొనసాగుతుంది. ఇందులో మొదటి ఆరు నెలలు విద్యార్థులు తమ చదివిన కోర్సుతో సంబంధం ఉన్న రంగంలో అనుభవాన్ని పొందుతారు. ప్రాక్టికల్ అనుభవం, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. విద్యార్థులు ఒకేసారి ఐదు ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు పరిశ్రమలో తమ స్థాయిని పెంచుకోవడంతో పాటు భవిష్యత్తుకు కావాల్సిన అనుభవాన్ని కూడా పొందగలరు.
దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభం. pminternship.mca.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థులు తమ రెస్యూమ్ పోర్టల్‌లో క్రియేట్ చేసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు తమ కెరీర్‌కు మంచి బలమైన పునాది వేసుకోవచ్చు. గడువు తీరుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు తద్వారా లాభం పొందేలా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.