Liquor : మందు బాబుల‌కి తాగ‌క‌ముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్క‌సారిగా పెరిగిన ధ‌ర‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liquor : మందు బాబుల‌కి తాగ‌క‌ముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్క‌సారిగా పెరిగిన ధ‌ర‌లు

 Authored By sandeep | The Telugu News | Updated on :17 January 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Liquor : మందు బాబుల‌కి తాగ‌క‌ముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్క‌సారిగా పెరిగిన ధ‌ర‌లు

Liquor : ఈ మ‌ధ్య కాలంలో కొత్త తెలంగాణ ప్ర‌భుత్వం Telangana Govt రైతుల‌కి గుడ్ న్యూస్‌లు చెబుతూ అంద‌రి విమ‌ర్శ‌లు అందిపుచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు Telangana తెలంగాణ సర్కార్ ఇపుడు మద్యం ప్రియులకు Wine షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై కీలక కసరత్తులు చేస్తోంది. ఏ విధంగా మద్యం ధరలు పెంచాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Liquor మందు బాబుల‌కి తాగ‌క‌ముందే కిక్ దిగేలా ఉందే ఒక్క‌సారిగా పెరిగిన ధ‌ర‌లు

Liquor: మందు బాబుల‌కి తాగ‌క‌ముందే కిక్ దిగేలా ఉందే.. ఒక్క‌సారిగా పెరిగిన ధ‌ర‌లు

Liquor  కిక్కిచ్చే న్యూస్..

కొన్నేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవటంతో.. తయారీ కంపెనీలు పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. మద్యం ధరల పెంపు పైన అధ్యయనం.. సిఫార్సుల కోసం ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది.మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ తొలిసారి జులై 18వ తేదీన సమావేశమైంది. జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్‌ చేయాలని సర్క్యులర్‌ ఇచ్చింది. ఆ తర్వాతి రోజే సీల్డ్‌ కవర్లు తెరిచి కంపెనీలు కోట్‌ చేసిన ధరలను కమిటీ పరిశీలించింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్‌, వైన్‌, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్‌ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్‌ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్‌ కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో చివరిసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం ధరలు భారీగా పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది