Teenmaar Mallanna : జాక్ పాట్ కొట్టిన తీన్మార్ మల్లన్న.. ఏకంగా రేవంత్‌ టీమ్‌లోకి? ఇది కదా అదృష్టం అంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teenmaar Mallanna : జాక్ పాట్ కొట్టిన తీన్మార్ మల్లన్న.. ఏకంగా రేవంత్‌ టీమ్‌లోకి? ఇది కదా అదృష్టం అంటే

 Authored By kranthi | The Telugu News | Updated on :16 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ గా తీన్మార్ మల్లన్న

  •  తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి హామీ

  •  రేవంత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తీన్మార్ మల్లన్న

Teenmaar Mallanna : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే.. తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వలసలు. అవును.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా కీలక నేతలు చేరడంతో కాంగ్రెస్ పార్టీకి భారీగా బలం వచ్చింది. అది బీఆర్ఎస్ కు మైనస్ అయింది. ఇదంతా పక్కన పెడితే.. ఇటీవలే కాంగ్రెస్ లోకి తీన్మార్ మల్లన్న కూడా వచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం తీన్మాన్ మల్లన్నకు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. రేవంత్ రెడ్డితో కలిసి తీన్మార్ మల్లన్న ప్రచారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే దూకుడుగా ఉన్నారు. ఇక.. తీన్మార్ మల్లన్న కూడా తోడు అయితే ఇక మామూలుగా ఉండదు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ ప్రచార కన్వినర్ గా నియమించారు.

దీంతో రేవంత్ రెడ్డితో జతకట్టి ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా మల్లన్న పాల్గొననున్నారు. అయితే.. ప్రస్తుతం మల్లన్న ఎమ్మెల్యేగా పోటీ చేయనప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తారని హామీ ఇవ్వడం వల్లనే మల్లన్న కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఎన్నికల ప్రచారంలో మల్లన్న దూసుకుపోవడం ఖాయం. ఆయన క్యూన్యూస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ చేసే ఆగడాలను ప్రజలకు చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చెప్పనున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరనున్నారు.

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడా?

తీన్మార్ మల్లన్న ఇప్పటికే బీజేపీలో చేరి ఆ పార్టీ విధానాలు నచ్చక ఈసారి కాంగ్రెస్ లో చేరారు. నిజంగా తీన్మార్ మల్లన్న ఈ అవకాశాన్ని ఇప్పుడైనా వినియోగించుకుంటే రాజకీయాల్లో రాణించగలడు. అలాగే.. కాంగ్రెస్ లో మున్ముందు మంచి పదవులు అనుభవించగలడు. చూద్దాం ఆయన రాజకీయ జర్నీ ఎలా ఉంటుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది