Telangana BJP : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన సీనియర్ నేత.. త్వ‌ర‌లో కాంగ్రెస్‌లోకి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana BJP : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన సీనియర్ నేత.. త్వ‌ర‌లో కాంగ్రెస్‌లోకి..?

 Authored By sukanya | The Telugu News | Updated on :27 July 2021,1:40 pm

Telangana BJP వివిధ పార్టీల నుంచి జోరుగా సాగిన వలసలతో ఊపు మీదు కనిపించిన తెలంగాణ బీజేపీ Telangana BJP కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి కటీఫ్ చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నేత హ్యాండిచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డికి బీజేపీకి రాజీనామా చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇనగాల పెద్దిరెడ్డి లేఖ విడుదల చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను పార్టీలో ఉండలేకపోతున్నానని వెల్లడించారు.

టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఇనగాల పెద్దిరెడ్డి గత లోక్ సభ ఎన్నికల సమయంలో ముందు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గానే ఉంటున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఇనగాల పెద్దిరెడ్డి సైలెంట్ అయ్యారు. ఇనగాల పెద్దిరెడ్డి కూడా గతంలో హుజురాబాద్ నుంచే పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరారని చెబుతారు. అందుకే ఈటల చేరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇనగాల పెద్దిరెడ్డి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈటల బీజేపీలోకి రావడానికి తాను వ్యతిరేకం కాదంటూనే.. తనతో సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.

inugala peddireddy may be Joine congress

inugala peddireddy may be Joine congress

మారుతోన్న సమీకరణాలు.. Telangana BJP

బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఇనగాల పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. పెద్దిరెడ్డితో బీజేపీ ముఖ్య నేతలు మాట్లాడారని, ఇనగాల పెద్దిరెడ్డి కూల్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. బండి సంజయ్ తో జరిగిన చర్చలు ఫలించాయని, ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని బీజేపీ నేతలు చెప్పారు. కాని సడెన్ గా రాజీనామాతో ముందుకు వచ్చారు ఇనగాల పెద్దిరెడ్డి. అయితే కొన్ని రోజులుగా తెలంగాణలో బిజెపికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.

టిపిసిసి చీఫ్ గా రేవంత రెడ్డి నియామకం జరిగిన తర్వాత పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్ చేరుతానని తెలిపారు. ఇక దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. ఇక వీరేకాక అప్పట్లో తనతో కలిసిపనిచేసిన, మాజీ టీడీపీ సీనియర్లపైనా రేవంత్ రెడ్డి దృష్టి సారించారన్న సంగతి తెలిసిందే.

బీజేపీలోకి వలసలు బంద్.. Telangana BJP

inugala peddireddy may be Joine congress

inugala peddireddy may be Joine congress

బీజేపీలో చేరుతారని భావించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడికి పీసీసీ పీఠం అప్పజెప్పడంతో మనసు మార్చుకున్నారని, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని చెబుతున్నారు. బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, స్వామిగౌడ్ కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బోడ జనార్ధన్, చాడా సురేష్ రెడ్డి వంటి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి బీజేపీలో చేరిన నేతలు కూడా సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ నేత ముకేష్ గౌడ్ తనయుడు, గ్రేటర్ నేత విక్రం గౌడ్ కూడా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీకి మళ్లీ పాతరోజులు తప్పట్లు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది