BJP : బీజేపీకి బైబై.. కేసీఆర్ ను పొగుడుతున్న ఆ సీనియర్ నేత.. త్వరలో కారెక్కనున్నారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP : బీజేపీకి బైబై.. కేసీఆర్ ను పొగుడుతున్న ఆ సీనియర్ నేత.. త్వరలో కారెక్కనున్నారా..?

 Authored By sukanya | The Telugu News | Updated on :23 July 2021,12:59 pm

Motkupalli Narasimhulu  : తెలంగాణ Telangana బీజేపీ BJp సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు Motkupalli Narasimhulu ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ BJP ని వీడి, త్వరలోనే టీఆర్ఎస్‌ TRS Party లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ Telangana ముఖ్యమంత్రి కొత్తగా తీసుకొచ్చిన ‘దళిత సాధికారత పథకం’ బీజేపీ BJP లో మోత్కుపల్లి నర్సింహులు Motkupalli Narasimhulu కు, ఆ పార్టీ నాయకత్వానికి మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ ఆదేశాలను కాదని.. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైనప్పటి నుంచి.. మోత్కుపల్లి నర్సింహులును ఆ పార్టీ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.

పైగా సీనియర్ నేత అయినప్పటికీ పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో మోత్కుపల్లి నర్సింహులు Motkupalli Narasimhulu సైతం కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మోత్కుపల్లి నర్సింహులుబీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. గత నెల 27న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను, ఆయా రంగాల్లో దళితుల కోసం కృషి చేస్తున్నవారిని సమావేశానికి ఆహ్వానించారు.

motkupalli narasimhulu May be joine in TRS

motkupalli narasimhulu May be joine in TRS

అఖిలపక్షంతోనే ..  Motkupalli Narasimhulu

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు కూడా ఆహ్వానం అందింది. దీంతో మోత్కుపల్లి నర్సింహులు సమావేశానికి హాజరయ్యారు. అయితే బీజేపీ నాయకత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించగా మోత్కుపల్లి నర్సింహులు హాజరవడం పార్టీలో చిచ్చు రేపింది. పార్టీ నాయకత్వానికి, ఆయనకు మధ్య గ్యాప్ పెరిగింది. దానికి తోడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదని మోత్కుపల్లి నర్సింహులు  Motkupalli Narasimhulu భావిస్తున్నారు.

పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీపై ఒకింత స్వరం పెంచారు. ఇప్పటికే బీజేపీకి, దళితులకు మధ్య గ్యాప్ ఉందని… ఇలాంటి తరుణంలో తాను దళిత ప్రజాప్రతినిధిగా బీజేపీ తరుపున ఆ సమావేశానికి హాజరుకావడం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లయిందని అన్నారు. అంతేకాక దళిత సాధికారత పథకాన్ని,ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన తీరును ప్రశంసించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి దళితుల కోసం ఇంత సమయం వెచ్చించి వారి సమస్యలపై చర్చించలేదని అన్నారు. దళితులకు మేలు జరుగుతుంటే ఆ వర్గానికి చెందిన నేతగా తాను వెళ్లకపోతే ఎలా అని పార్టీని నిలదీశారు. పైగా పార్టీ నాయకత్వానికి చెప్పే తాను వెళ్లానని… ఎక్కడా పార్టీ లైన్‌ను దాటలేదని తెలిపారు.

బీజేపీ కినుక.. Motkupalli Narasimhulu

motkupalli narasimhulu May be joine in TRS

motkupalli narasimhulu May be joine in TRS

అయితే మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్‌ను,ఆయన తీసుకొచ్చిన పథకాన్ని ప్రశంసించడం బీజేపీకి మింగుడుపడలేదు. ఆ సమావేశానికి హాజరై వచ్చాక కేసీఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు Motkupalli Narasimhulu స్వరం మారుతోందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపించాయి. అయితే మోత్కుపల్లి నర్సింహులు అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. పైగా తానేమీ పైరవీకారుడిని కాదని… వ్యాపార లావాదేవీల కోసం రాజకీయాలు చేయట్లేదని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి వచ్చే విమర్శలకు భయపడేది, బెదిరేది లేదని గట్టిగానే మాట్లాడారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చానని… తానేమీ తొందరపడట్లేదని తెలిపారు.

మొత్తం మీద మోత్కుపల్లి నర్సింహులు Motkupalli Narasimhulu వ్యాఖ్యలతో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. ప్రాధాన్యత లేని చోట ఉండటం తన విలువను తగ్గించుకోవడమేనని మోత్కుపల్లి నర్సింహులు కూడా భావించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీని వీడి మోత్కుపల్లి నర్సింహులు కారెక్కుందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అదే టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇప్పుడు గులాబీ గూటికే చేరుతుండటం గమనార్హం.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది