Telangana Budget 2024 : కోటిమంది మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్య : భట్టి విక్రమార్క..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Budget 2024 : కోటిమంది మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్య : భట్టి విక్రమార్క..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Budget 2024 : కోటిమంది మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్య : భట్టి విక్రమార్క..!

Telangana Budget 2024 : తెలంగాణా ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిని. గ్రామీణ మహిళాభివృద్ధికి ఇదిరా మహిళా శక్తి పథకం తీసుకొచ్చే విషయాన్ని వెల్లడించారు డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మల్లు భటి విక్రమార్క. మహిళలు సాధించిన ప్రగతే సమాజ ప్రగతికి కొలమానం అని బి ఆర్ అంబేద్కర్ అన్న వ్యాఖ్యలను తాను నిజమని నమ్ముతున్నా అన్నారు భట్టి. తెలంగాణా ప్రభుత్వం 63 లక్షల మహిళలకు వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిద్దిగుతుందనే ఇందిరా మహిళా శాక్తి పథకానికి రూపకల్పన అని అన్నారు. ఇందుకు గాను స్త్రీ నిధి ఏర్పాటుతో పాటుగా బ్యాంకులతో అనుసంధానం అనే మార్గలను లక్షల్ కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందంచి ఈ లక్ష్యం సాధిస్తామని అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాళ్లి వృత్తి నపుణ్య శిక్షణ ఇప్పించడంతో బ్రాండింగ్, మార్కెటింగ్ లో మెలకువలు పెంపొందించే విధంగ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.

Telangana Budget 2024 మహిళా పారిశ్రామికులకు ప్రభుత్వం చేయూత..

మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేద్రాలు.. ప్రతి శాసనసభ నియోజక వర్గం లో ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేస్తమని భట్టి అన్నారు. ఈ పథకం ద్వారా వారికి ప్రభుత్వం నుంచి 5000 గ్రామీణ సంఘాలు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరేలా కార్యచరణ చేస్తామని రాబోయే ఐదేళ్ల 25000 సంస్థలకు విసరించేలా కృషి చేస్తామని అన్నారు. ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ భీమా పథకం ప్రవేశ పెట్టిన విషయాన్ని చెప్పారు. అంతేకాదు స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అసలసత్వంతో నిధుల లేమితో కుంటుపడ్డాయి వారికి ఊతమిచ్చేలా వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

Telangana Budget 2024 కోటిమంది మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్య భట్టి విక్రమార్క

Telangana Budget 2024 : కోటిమంది మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్య : భట్టి విక్రమార్క..!

వీటిని మైక్రో, స్మాల్ ఇండిస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చేసేందు సహాయపడతాయని అన్నారు. స్కూల్ యూనిఫాం లు కూడా స్వయం సహాయక బృందాలు ఇంకా మహిళా సభ్యులకు అప్పజెప్పాలనే నిర్ణయం తీసుకుని విద్యా శాఖ తో పాటుగా సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది