Telangana Cabinet : హైకమాండ్ తలనొప్పిగా మారిన తెలంగాణ మంత్రివర్గం
ప్రధానాంశాలు:
Telangana Cabinet : హైకమాండ్ తలనొప్పిగా మారిన తెలంగాణ మంత్రివర్గం
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 3న ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినా, కొత్త సమస్యలు తలెత్తడంతో జాబితా ఖరారు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలున్నాయి. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ కొత్త మంత్రుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పార్టీ లోపల ఉన్న రాజకీయ సమీకరణాలు, సీనియర్ నేతల ఆశలు, నేతల ఒత్తిళ్లు హైకమాండ్ వ్యూహాన్ని మారుస్తున్నాయి. ఫలితంగా తుది జాబితాలో మార్పుల అవకాశం పెరిగింది.

Telangana Cabinet : హైకమాండ్ తలనొప్పిగా మారిన తెలంగాణ మంత్రివర్గం
Telangana Cabinet సీఎం , డిప్యూటీ చేతుల్లో వేరువేరు కొత్త మంత్రుల లిస్ట్ ..?
మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల నియామకంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం చివరి మెరుగులు దిద్దుతోంది. ముఖ్యంగా మంత్రి పదవి కోసం పోటీదారుల సంఖ్య అధికంగా ఉండటం పెద్ద సమస్యగా మారింది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు దాదాపు 30 మంది నేతలు ఆశక్తి కనబరుస్తుండటంతో తుది జాబితా రూపొందించడం కష్టసాధ్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు తమ తమ జాబితాలను ఢిల్లీకి పంపించారు. ఇందులోని నేతల పేర్లను పరిశీలిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే పనిలో ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రివర్గంలో ఆరు ఖాళీలుండగా, అన్ని భర్తీ చేయకూడదనే ఆలోచనలో పార్టీ ఉంది. పార్టీ అంతర్గత విభేదాలు, జిల్లాల ప్రాతిపదికన సమీకరణలు, సామాజిక సమతుల్యత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తుది జాబితాలో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యంగా సీనియర్ నేతలు, మహిళా నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని చూస్తోంది. చివరి నిమిషం వరకు నేతల లాబీయింగ్ ముమ్మరంగా సాగుతుండటంతో, తుది జాబితా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.