KCR : సరిగ్గా ఎలక్షన్స్ దగ్గర పడుతుండగా జగన్ స్ట్రాటజీతో కేసీఆర్..!!
KCR : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంక మూడు నెలల సమయం ఉంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సమయం నుండే లక్ష ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చడం జరిగింది.
ఈ పరిణామంతో తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు తమను కూడా ఏపీ ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగస్తులను గుర్తించే రీతిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో 43, 373 మంది ఆర్టీసీ సిబ్బందికి మేలు చేసినట్లు అయింది. ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం కి సంబంధించి సోమవారం ఉన్నత అధికారులతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఆగస్టు మూడు నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోయే శాసనసభ సమావేశాలకు సంబంధించి.. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో.. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.