
Revanth Reddy : ఆ విషయంలో చంద్రబాబుకి గట్టి పంచే ఇచ్చిన రేవంత్ రెడ్డి..!
Revanth Reddy : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటిపై కొన్ని రోజుల నుండి ఆసక్తికర చర్చ నడిచింది. ఎట్టకేలకి గత రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కరించుకోవాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలాగే షెడ్యూల్ 10లోని అంశాలపైనే ముఖ్యంగా చర్చించారు. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఇరు రాష్ట్రాల సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
భద్రాచంలోని ఏపీలో కలిపిన 7 మండలాల్లో ఐదు గ్రామాలను తెలంగాణ అడిగింది. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఏపీ కోరగా.. తెలంగాణ దానికి తిరస్కరించింది. ఏపీనే తమకి బకాయిలు తిరిగి చెల్లించాల్సి ఉందని బదులిచ్చింది.హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కోరగా.. తెలంగాణలో ఉన్న స్థిరాస్తులన్నీ తమకే చెందుతాయని రేవంత్ బదులిచ్చారు.
Revanth Reddy : ఆ విషయంలో చంద్రబాబుకి గట్టి పంచే ఇచ్చిన రేవంత్ రెడ్డి..!
చర్చల ద్వారా, పట్టు విడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని సమాచారం. నీటి కేటాయింపులపై మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కలిపిన 7 ముంపు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి అడిగారని సమాచారం..విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు ముందుకు రావడం హర్షించదగిన పరిమాణం అని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలో సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.