Telangana Elections Results 2023 : జిల్లాల వారీగా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీళ్లే.. మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్న కాంగ్రెస్
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు 10 రౌండ్ల లెక్కింపు ముగిసింది. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు 55 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా.. 12 స్థానాల్లో గెలుపు సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 35 స్థానాల్లో లీడ్ లో ఉండగా 3 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో లీడ్ లో ఉండగా ఒక్కస్థానంలో గెలిచింది. ఎంఐఎం 2 స్థానాల్లో లీడ్ లో ఉండగా, 3 స్థానాల్లో గెలిచింది.
ఇక.. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మా ఉత్తమ్ రెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, షాద్ నగర్, నాగార్జునసాగర్, నకిరేకల్, మెదక్ లో మైనంపల్లి రోహిత్ రెడ్డి విజయం సాధించారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ విజయం సాధించారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ గెలుపు సాధించారు. డోర్నకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ చంద్రునాయక్ విజయం సాధించారు. చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ విజయం సాధించారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మందులు సామేల్ విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మధన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు. జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. నర్సంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి విజయం సాధించారు.
బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్లలో మంత్రి తలసాని ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గెలిచారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం విజయం సాధించారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత విజయం సాధించారు. ఎంఐఎం పార్టీ నుంచి చార్మినార్ అభ్యర్థి గెలిచారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.