Telangana Elections Results 2023 : ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన అన్ని పార్టీల అభ్య‌ర్థులు వీళ్లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Elections Results 2023 : ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన అన్ని పార్టీల అభ్య‌ర్థులు వీళ్లే

 Authored By aruna | The Telugu News | Updated on :3 December 2023,1:55 pm

Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 10 రౌండ్ల లెక్కింపు ముగిసింది. ఈనేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు 55 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండ‌గా.. 12 స్థానాల్లో గెలుపు సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 35 స్థానాల్లో లీడ్ లో ఉండ‌గా 3 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో లీడ్ లో ఉండ‌గా ఒక్క‌స్థానంలో గెలిచింది. ఎంఐఎం 2 స్థానాల్లో లీడ్ లో ఉండగా, 3 స్థానాల్లో గెలిచింది.

ఇక‌.. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ల‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ప‌ద్మా ఉత్త‌మ్ రెడ్డి, కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి, షాద్ న‌గ‌ర్, నాగార్జున‌సాగ‌ర్, న‌కిరేక‌ల్, మెద‌క్ లో మైనంప‌ల్లి రోహిత్ రెడ్డి విజ‌యం సాధించారు. వేముల‌వాడ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆది శ్రీనివాస్ విజ‌యం సాధించారు. దేవ‌ర‌కొండ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి బాలునాయ‌క్ విజ‌యం సాధించారు. మ‌హ‌బూబాబాద్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ముర‌ళీ నాయ‌క్ గెలుపు సాధించారు. డోర్న‌క‌ల్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి రామ్ చంద్రునాయ‌క్ విజ‌యం సాధించారు. చెన్నూరులో కాంగ్రెస్ అభ్య‌ర్థి వివేక్ విజ‌యం సాధించారు. తుంగ‌తుర్తిలో కాంగ్రెస్ అభ్య‌ర్థి మందులు సామేల్ విజ‌యం సాధించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ధ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించారు. జుక్క‌ల్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిచారు. ములుగులో కాంగ్రెస్ అభ్య‌ర్థి సీత‌క్క విజ‌యం సాధించారు. న‌ర్సంపేట‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి దొంతి మాధ‌వ రెడ్డి విజ‌యం సాధించారు.

బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ల‌లో మంత్రి త‌ల‌సాని ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ప‌ద్మారావు గెలిచారు. బాన్సువాడ‌లో స్పీక‌ర్ పోచారం విజ‌యం సాధించారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి లాస్య‌నందిత విజ‌యం సాధించారు. ఎంఐఎం పార్టీ నుంచి చార్మినార్ అభ్య‌ర్థి గెలిచారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది