Telangana Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మార్గదర్శకాలు.. ఎవరెవరికి అందుతాయి..!
Telangana Ration Card : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
Telangana Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మార్గదర్శకాలు.. ఎవరెవరికి అందుతాయి..!
ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న వినతుల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇక కొత్త రేషన్ కార్డులను ఏ ప్రాతిపదికను లబ్ధిదారులకు అందించనున్నారంటే?. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇటీవల జరిగిన కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన కోసం అందుకుంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో లు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారు.
కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు.. ఈ సందర్భంగా చదివి వినిపించి చర్చించిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు ఆమోదం లభించనుంది. . రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికారులతో చర్చించారు. ఇందులో కొత్త రేషన్ కార్డులపై కీలక విషయం వెల్లడించారు. ముఖ్యమైన తేదీలను వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల కోసం జనవరి 16 నుండి 20 వరకు తెలంగాణ అంతటా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 21 నుండి 24 వరకు గ్రామ, వార్డు సమావేశాల్లో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ఉంచి, ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.