Categories: NewsTelangana

Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!

Advertisement
Advertisement

Telangana government : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం కింద కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులను జమ చేశారు. కానీ, తాజా నిర్ణయంతో 3 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులను కూడా రైతు భరోసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అయితే, సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌ చేసి, వారికి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది.

Advertisement

Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!

ప్రభుత్వం ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 3,487.82 కోట్ల నిధులను జమ చేసింది. మొత్తం 58.13 లక్షల ఎకరాల భూమికి నిధులు అందాయి. ఈ పథకం నాలుగు విడతలుగా అమలు అయ్యింది. మొదటి విడత కింద 17.03 లక్షల మంది రైతులకు రూ. 557.54 కోట్లు, రెండో విడత కింద 13.23 లక్షల మంది రైతులకు రూ. 1,091.95 కోట్లు, మూడో విడత కింద 10.13 లక్షల మంది రైతులకు రూ. 1,269.32 కోట్లు, నాలుగో విడత కింద 9.12 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,000 కోట్లు కేటాయించారు. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు మార్చి 31లోగా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

అలాగే ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సాగుకు అనర్హమైన భూములు, బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమిలో 3 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని గుర్తించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో మిగిలిన రైతులకు నిధులను పంపిణీ చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Recent Posts

Team India : టీం ఇండియా కప్ గెలిచింది కానీ అనుమానాలు పెంచింది

Team India : దుబాయ్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత క్రికెట్ జట్టు ఘన…

4 hours ago

Bank Holidays : మూడు రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays : మార్చి 13, 14, 15 తేదీల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు బంద్ ఉండనున్నాయి.…

5 hours ago

PM Internship Scheme 2025 : విద్యార్థులకు నెలకు 5 వేలు పొందే ఛాన్స్..ఈరోజు వరకే అవకాశం

PM Internship Scheme 2025 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ 2025 ప్రోగ్రామ్ నిరుద్యోగ యువతకు మంచి…

6 hours ago

Union Bank of India : ఉద్యోగార్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త!

Union Bank of India : ఉద్యోగార్థులకు శుభవార్త! యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 దరఖాస్తు…

8 hours ago

PM Kisan Scheme : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

PM Kisan Scheme :  దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్…

9 hours ago

Amrutha : ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక తీర్పు..అమృత పై నెటిజన్లు ఫైర్

Amrutha : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన  పప్రణయ్రువు హత్య కేసులో కోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు…

10 hours ago

Rajendra Prasad : ప్రమోషన్ లో తన పోస్టర్ లేదని రాజేంద్రప్రసాద్ అసంతృప్తి

Rajendra Prasad : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి…

11 hours ago

MLA Vemula Veeresham : ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసిందో ఎవరో తెలిసింది

MLA Vemula Veeresham : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిన…

12 hours ago