Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
ప్రధానాంశాలు:
Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
Telangana government : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం కింద కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులను జమ చేశారు. కానీ, తాజా నిర్ణయంతో 3 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులను కూడా రైతు భరోసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అయితే, సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసి, వారికి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది.

Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
ప్రభుత్వం ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 3,487.82 కోట్ల నిధులను జమ చేసింది. మొత్తం 58.13 లక్షల ఎకరాల భూమికి నిధులు అందాయి. ఈ పథకం నాలుగు విడతలుగా అమలు అయ్యింది. మొదటి విడత కింద 17.03 లక్షల మంది రైతులకు రూ. 557.54 కోట్లు, రెండో విడత కింద 13.23 లక్షల మంది రైతులకు రూ. 1,091.95 కోట్లు, మూడో విడత కింద 10.13 లక్షల మంది రైతులకు రూ. 1,269.32 కోట్లు, నాలుగో విడత కింద 9.12 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,000 కోట్లు కేటాయించారు. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు మార్చి 31లోగా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సాగుకు అనర్హమైన భూములు, బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమిలో 3 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని గుర్తించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో మిగిలిన రైతులకు నిధులను పంపిణీ చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.