Telangana Govt : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధుల జమ ఎప్పుడంటే ?
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద పంట వేసుకునే ప్రారంభంలోనే సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందించేది. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతు బంధును రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును అలాగే అందించింది. తర్వాత పథకం పేరును ఎన్నికల సందర్భంలో చెప్పిన మాదిరిగానే రైతు భరోసాగా మార్చింది. పథకం ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని భావించి ఈ పథకంను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. సాగులో లేని భూములను గుర్తించడం, అనర్హులను ఏరివేసి పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సైతం సేకరించారు.
ఈ నేపథ్యంలో అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. గతంలో సాగులేని భూములకు కూడా రైతు బంధు అందించారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రక్షాళన చేసి అర్హులైన వారికి రైతు భరోసా అందిస్తామని అంటున్నారు.
Telangana Govt : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధుల జమ ఎప్పుడంటే ?
ప్రస్తుతం వరికోతలు ప్రారంభం అయ్యాయి. జనవరిలో మళ్లీ పంట వేసేందుకు రైతులు సిద్ధం కానున్నారు. అయితే అప్పుడే రైతు భరోసా నిధులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి గత పెట్టుబడి సమయంలోనే రూ.7,500 ఇవ్వాల్సి ఉంది. అప్పుడు రుణమాఫీ చేయడంతో ఆ తర్వాత ఒకేసారి రూ.15 వేలు అందిస్తారన్న ప్రచారం సాగింది. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనతో రూ.7,500 జమ అయ్యే అవకాశం ఉంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.