Telangana Govt : రైతుల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధుల జ‌మ ఎప్పుడంటే ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Govt : రైతుల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధుల జ‌మ ఎప్పుడంటే ?

 Authored By ramu | The Telugu News | Updated on :19 October 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Govt : రైతుల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధుల జ‌మ ఎప్పుడంటే ?

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభ‌వార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని రాష్ట్ర‌ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ‘రైతు బంధు’ పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద పంట వేసుకునే ప్రారంభంలోనే సీజ‌న్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందించేది. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతు బంధును రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును అలాగే అందించింది. త‌ర్వాత ప‌థ‌కం పేరును ఎన్నిక‌ల సంద‌ర్భంలో చెప్పిన మాదిరిగానే రైతు భ‌రోసాగా మార్చింది. ప‌థ‌కం ఎక్కువ‌గా దుర్వినియోగం అవుతుంద‌ని భావించి ఈ పథకంను ప్రక్షాళన చేయాలని నిర్ణ‌యించింది. సాగులో లేని భూముల‌ను గుర్తించ‌డం, అనర్హులను ఏరివేసి పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి రైతుల‌ అభిప్రాయాలు సైతం సేకరించారు.

ఈ నేపథ్యంలో అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. గతంలో సాగులేని భూములకు కూడా రైతు బంధు అందించార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో ప్రక్షాళన చేసి అర్హులైన వారికి రైతు భరోసా అందిస్తామని అంటున్నారు.

Telangana Govt రైతుల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌ రైతు భరోసా నిధుల జ‌మ ఎప్పుడంటే

Telangana Govt : రైతుల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధుల జ‌మ ఎప్పుడంటే ?

ప్రస్తుతం వరికోతలు ప్రారంభం అయ్యాయి. జనవరిలో మళ్లీ పంట వేసేందుకు రైతులు సిద్ధం కానున్నారు. అయితే అప్పుడే రైతు భరోసా నిధులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి గత పెట్టుబడి సమయంలోనే రూ.7,500 ఇవ్వాల్సి ఉంది. అప్పుడు రుణమాఫీ చేయడంతో ఆ తర్వాత ఒకేసారి రూ.15 వేలు అందిస్తారన్న ప్రచారం సాగింది. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనతో రూ.7,500 జ‌మ అయ్యే అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది