Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం… రేషన్ కార్డు లేకుండానే పథకాల అమలకు శ్రీకారం…!
Ration Cards : పేద మరియు మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దారిద్రపు రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే కూడా ఈ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను పొందగలుగుతారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నఅనేక రకాల సంక్షేమ పథకాలకు అర్హత సాధించాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఇక […]
ప్రధానాంశాలు:
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం... రేషన్ కార్డు లేకుండానే పథకాల అమలకు శ్రీకారం...!
Ration Cards : పేద మరియు మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దారిద్రపు రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే కూడా ఈ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను పొందగలుగుతారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నఅనేక రకాల సంక్షేమ పథకాలకు అర్హత సాధించాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే ట్రెండు కొనసాగుతూ వస్తుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. దీంతో చాలామంది అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను పొందలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం… తాము అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది. అన్నట్లుగానే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం అర్హుల నుండి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 తర్వాత నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం పేర్కొంది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే దిశగా కార్యచరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆరోగ్య శ్రీ విషయంలో డిజిటల్ హెల్త్ కార్డులను జారీచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ లేకుండానే ఈ పథకాన్ని అందించడం జరుగుతుంది. ఇదేవిధంగా మిగతా పథకాలకు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇకపై రేషన్ కార్డులు కేవలం రేషన్ సరుకులు కొనడానికి మాత్రమే ఉపయోగపడతాయి అన్నమాట. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అంశంపై అన్ని వైపుల నుండి సానుకూల ప్రతిస్పందన లభిస్తే ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది.