Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్.. శాఖ నిధుల కేటాయింపు ఎలా జరిగింది అంటే..!
ప్రధానాంశాలు:
Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్.. శాఖ నిధుల కేటాయింపు ఎలా జరిగింది అంటే..!
Telangana Budget 2024 : పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలని స్వస్తి చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ కూడా విడుదల చేశారు. ఇందులో మహిళా సాధికారికతకు ప్రాధాన్యత ఇచ్చింది. వారికోసం బడ్జెట్‌లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యం. శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమైన బడ్జెట్‌ను ఆమోదించారు.
Telangana Budget 2024 రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్..
రెవెన్యూ వ్యయం రూ. 2,20,945 కోట్లు
మూల ధన వ్యయం రూ. 33,487 కోట్లు
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
హోం శాఖ రూ. 9,564 కోట్లు
వ్యవసాయం – రూ. 72,659 కోట్లు
వైద్యం, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 22,301 కోట్లు
విద్యారంగం రూ. 21,292 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు
ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు
పరిశ్రమల శాఖ రూ. 2,762 కోట్లు
ఐటీ రంగం రూ. 774 కోట్లు
అడవులు, పర్యావరణం రూ. 1,064 కోట్లు
ఉద్యానవనం రూ. 737 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు
రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ. 723 కోట్లు
గృహజ్యోతి పథకం కోసం రూ. 2,418 కోట్లు
ప్రజా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 29,816 కోట్లు
ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ. 50.41 కోట్లు

Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్.. శాఖ నిధుల కేటాయింపు ఎలా జరిగింది అంటే..!
Telangana Budget 2024 జీహెచ్ఎంసీ పరిధిలో కేటాయింపులు ఇలా..
మెట్రో వాటర్ వర్క్స్ – రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ – రూ. 200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన – రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన రూ. 500 కోట్లు
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ రూ. 100 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు
పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ రూ. 50 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు
సంక్షేమానికి కేటాయింపులు ఇలా..
బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు