Telangana : తెలంగాణ అధికారిక చిహ్నం ఇదేనట.. దాదాపు ఫైనల్ అయినట్టే..!
Telangana : తెలంగాణలో ఇప్పుడు అధికారిక చిహ్నం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక చిహ్నం మార్పుపై దృష్టి సారించింది. రాజముద్రలో రాజచిహ్నాలు ఉండొద్దని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఆ చిహ్నం మార్పుకోసం ఆదేశించారు. కాగా ఇప్పటికే చాలా లోగోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ చిహ్నం ఉంటే బాగుంటుంది అంటూ కొన్ని ఫొటోలను కొందరు పోస్టులు చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లోపు ఆ చిహ్నాన్ని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే పెయింటర్ రాజేష్ ఇప్పటికే 37 రకాల చిహ్నాలను సర్కార్ కు అందజేశారంట. అందులో చాలా రకాల చిహ్నాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మూడు చిహ్నాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అందులో ప్రధానంగా ఒక దాన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆ చిహ్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉండిపోయింది. ఇందులో భారత జాతీయ చిహ్నం అయిన మూడు సింహాలతో పాటు కింద అమర వీరుల స్థూపం ఉంది. మధ్యలో వరి కంకులు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రభుత్వం అని నాలుగు భాషల్లో రాసి ఉంది.
Telangana : తెలంగాణ అధికారిక చిహ్నం ఇదేనట.. దాదాపు ఫైనల్ అయినట్టే..!
తెలుగు, హిందీ, ఉర్ధూ, ఇంగ్లిష్ లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. అందుకే ఇప్పుడు దాన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే రెండు రోజుల్లో దీన్నే ఫైనల్ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని భావించారు. అందుకే ఇంత త్వరగా దాన్ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ మార్పుపై బీఆర్ ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సాంస్కృతిని దెబ్బ తీస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కానీ అధికారిక చిహ్నంలో రాజ ముద్ర వాసనలు ఎందుకు అంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తమకు రాజకీయ చిహ్నాలు వద్దని.. తెలంగాణ కోసం పోరాడిన వారి గుర్తింపు ముఖ్యం అంటున్నారు.
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
This website uses cookies.